లేసు కళాకారుల జీవితాల్లో వెలుగులు

*రామన్నపాలెంలో టూల్‌కిట్స్ పంపిణీ

మొగల్తూరు మండలంలోని రామన్నపాలెం పంచాయతీ కార్యాలయంలో శనివారం లేసు హస్త కళాకారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టూల్‌కిట్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, గౌరవ శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్, రామన్నపాలెం గ్రామానికి చెందిన 50 మంది ఎస్.సి మహిళా హస్త కళాకారులకు ఇంప్రూవ్డ్ టూల్‌కిట్లు పంపిణీ చేశారు. అపిటికో లిమిటెడ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో, అభివృద్ధి కమిషనర్ (హస్తకళలు), కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే, పేరుపాలెం, కొత్తత, కాళీపట్నం, కేపీ పాలెం గ్రామాల నుండి వచ్చిన 60 మందికి సర్టిఫికెట్లు కూడా అందజేయబడ్డాయి. ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, ఇవి సాంకేతికంగా మెరుగైన టూల్స్ అని, వాటిని ఉపయోగించి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం హస్తకళాకారుల అభ్యున్నతికి చేస్తున్న కృషిని అభినందించారు. విజయవాడ నుండి హాజరైన అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ, కేంద్రం అందిస్తున్న పథకాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామన్నపాలెం సర్పంచ్ బందెల ఎలిశా, పీడీ సుధీర్ కుమార్, ఆకన చంద్రశేఖర్, వలవల నాని, మైల వసంతరావు, వాతడి కనకరాజు, నిప్పులేటి తారక రామారావు, అయితం చిన్ని, పిప్పల సత్యతో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-06-28-at-5.03.42-PM-1024x682 లేసు కళాకారుల జీవితాల్లో వెలుగులు

Share this content:

Post Comment