స్థానిక సమస్యలు, కూటమి విజయమే లక్ష్యంగా ఇంటింటికి పవనన్న ప్రజాబాట: బొర్రా

సత్తెనపల్లి: ప్రజలకు చేరువ అవటమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యమని అందుకే ప్రజాబాట కార్యక్రమాన్ని రూపొందించారని జనసేన సత్తెనపల్లి సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. మంగళవారం నకరికల్లు మండలంలోని కుంకలగుంటలో పవనన్న ప్రజాపాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొర్రా మాట్లాడుతూ.. జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ గారిని కొనియాడారు. ఈ సందర్భంగా బొర్రా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు బొర్రా. మన కూటమి అధికారంలోకి వస్తోందని స్పష్టం చేసిన ఆయన, క్షేత్రస్థాయి నుంచి మన బలాన్ని సద్వినియోగపరుకొంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని సూచించారు. సమిష్టిగా గెలుపు కోసమే నా వ్యూహం, అడుగులు ఉంటున్నాయని తెలిపారు. జనసేన కోసం తపించి పని చేసిన ప్రతీ ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో కావచ్చు.. పీఏసీఎస్‌ల్లో, ఇతర కీలక నామినేటెడ్‌ పదవుల్లో సముచిత స్థానాలు మనకు దక్కుతాయి.. తద్వారా అందరినీ బలోపేతం చేసి ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. మూడింట ఒక వంతు పదువులు దక్కించుకుందాం అన్నారు. ఏపీకి సుస్థిర పాలన అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని, అలాంటి సుస్థిర పాలన మన కూటిమి అందించగలదని ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట సాంబశివరావు, సత్తనపల్లి కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, కమిటీ సభ్యులు కేశవ, నకరికల్లు మండల అధ్యక్షురాలు లక్ష్మీ శ్రీనివాస్, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు షేక్ రఫీ, అంచుల వారి పాలెం మాజీ సర్పంచ్ ఉదయ్ భాస్కర్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు నాగభూషణం, దార్ల శ్రీను, కడియం అంకమ్మరావు, పుష్ప నామాల, శిరీష అమ్మిసెట్టి, మండల నాయకులు, గ్రామ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.