భారీ కవాతుకు పిలుపునిచ్చిన లోకం మాధవి

నెలిమర్ల, ఆదివారం 6వ తారీఖున మన నియోజకవర్గంలో తలపెట్టిన జనసేన భారీ బహిరంగ సభను రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ దుశ్చర్యల ద్రృష్ట్యా వాయిదా వేస్తున్నాము. ఈ బహిరంగ సభ తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తాము నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు లోకం మాధవి మీడియా ముఖంగా తెలిపార్. మన అందరి అభిమాన నాయకులు, అధినేత పవన్ కళ్యాణ్ మీద హత్యాయత్నాలను, రాజకీయ కుట్రలను నిరసిస్తూ ఈ ఆదివారం 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నెలిమర్లలో భారీ కవాతు చెయ్యదలిచాము. కనుక ఈ కవాతుకి నియోజకవర్గంలో ప్రతీ జనసైనికుడు తరలి వచ్చి, అధినేతకు హాని చెయ్యాలని చూస్తే క్షేత్ర స్థాయిలో జనసైనికులు, వీరమహిళలు ప్రజాస్వామ్య పద్దతిలో ఎంత బలంగా నిలబడతారో తెలియజేయాల్సిన సమయమిది. కావున అందరూ ఈ భారీ నిరసన కవాతులో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని విఙ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.