చింతలవలస పంచాయతీలో లోకం మాధవి గడపగడపకు జనసేన

నెల్లిమర్ల నియోజకవర్గం: డెంకాడ మండలం, చింతలవలస పంచాయతీలోని నెల్లిమర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి గడపగడపకు పర్యటించారు. చింతలవలస విచ్చేసిన శ్రీమతి లోకం మాధవికి, అక్కడి జనసైనికులు మరియు జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. చింతలవలసలో ఉన్న 1వ వార్డు నుండి 5వ వార్డు వరకు ఈ గడపగడపకు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా లోకం మాధవి ప్రతి గడపకు పర్యటిస్తూ, ప్రతి ఆడపడుచుతో మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను రూపుమాపి ప్రజా ప్రభుత్వ పాలనకు నాంది పలకాలని ప్రతి ఒక్కరిని కోరారు. అక్కడి కొన్ని సమస్యలను స్థానికులు శ్రీమతి లోకం మాధవి దృష్టికి తీసుకొని వచ్చారు. వాటిలో కడగల పైడిరాజు అనే మహిళకు అన్ని అర్హతలు కలిగి ఉన్నా గానీ ఇల్లు అనేది ఇప్పటివరకు మంజూరు అవ్వలేదు, అలాగే ఆ ఆ పంచాయతీలోని వీధుల్లో ఎటువంటి కాలువలు కానీ చిన్న రోడ్డు సదుపాయం కానీ ఇప్పటివరకు కల్పించలేదు. అలాగే మోపడ పాపయ్యమ్మ అనే మహిళకి ఇంటి బిల్లు మంజూరు చేసి, దాన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు దానికి కారణమేమిటో కూడా ఇప్పటివరకు తెలియజేయలేదు. సమస్య విన్న లోకం మాధవి సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్తామని, జరగనియెడల వచ్చే తమ జనసేన ప్రభుత్వంలో వారికి పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆ పంచాయతీలో డిగ్రీ పూర్తి చేసిన ఎంతోమంది మహిళలు ఇప్పటివరకు ఓటు హక్కు లేని చేత, లోకం మాధువి వారికి ఆ ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలిపి ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. అదేవిధంగా ఆ పంచాయతీలో ఉన్న రైతాంగానికి ప్రభుత్వం పాస్ బుక్ లు కానీ పట్టాలు కానీ ప్రభుత్వం కల్పించలేదని తెలియజేశారు. వాటిని సంబంధిత వ్యవసాయ అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా చూస్తాను అని లోకం మాధవి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మలక్ష్మీ రాజ్, నెల్లిమర్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు బూర్లే విజయ శంకర్ తుమ్మి అప్పలరాజు, డెంకాడ మండలం నాయకులు
పిన్నింటి రాజారావు, పైలా శంకర్, తొత్తడి సూర్యప్రకాష్, దిండి రామారావు, లింగం, రమేష్ లింగం లక్ష్మణ్, బుడి కృష్ణారావు, పైల శ్రీను, గౌరీ శంకర్, పైల సురేష్, కోన శివ సూరిబాబు మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.