రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన లోకం మాధవి

విజయనగరం జిల్లా, ఎల్.కోట మండలం, కంటకాపల్లిలో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మంగళవారం విజయనగరం మహాత్మాగాంధీ ప్రభుత్వ హాస్పిటల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్ మరియు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి సందర్శించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా హాస్పిటల్లో సదుపాయాలు సరిగా లేవని ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు సరిగా కల్పించడం లేదని అవసరమైన సామాగ్రిని కూడా అందించటం లేదు వాపోయారు. క్షతగాత్రులకు పండ్లు, దుప్పట్లు, తల దిండ్లు, ఐస్ బ్యాగులు మరియు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.