జోగిరాజుపేట పంచాయతీలో లోకం మాధవి పర్యటన

నెల్లిమర్ల నియోజకవర్గం: నెల్లిమర్ల మండలంలోని జోగిరాజుపేట పంచాయతీలో మన ఊరిలో జణవాణీ కార్యక్రమంలో భాగంగా లోకం మాధవి ప్రతిగడపకి పర్యటించి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. లోకం మాధవి మాట్లాడుతూ.. జోగిరాజుపేట గ్రామంలో అధిక శాతం మంది రైతులు ఉన్నారని, ప్రస్తుత ప్రభుత్వం ఈ రైతులని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవట్లేదని, అలాగే కూలీలను కూడా విస్మరిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఉపాధి హామీ తప్పించి మిగతా ఎక్కడా పనులు దొరకట్లేదని, ఇలా అయితే కూలీ చేసుకుని కుటుంబం గడిపే వాళ్ల పరిస్థితి ఏంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే మహిళలకి యువతకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి అంటే మన నెల్లిమర్ల నియోజకవర్గంలోకి పరిశ్రమలు రావాలి అని, పరిశ్రమలు అంటే కాలుష్యాన్ని చిన్ని ఎవరికో ఇచ్చే ఉద్యోగాలు కాదని, మన రైతులు పండించిన పంటకి వాటి అనుసంధానంగా పరిశ్రమలు పెట్టి, వాటిలో మన నియోజకవర్గంలోని అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ఒక విద్యావంతురాలునని దేశ విదేశాలు తిరిగి అక్కడ పరిస్థితులు అన్నీ ఆకలింపు చేసుకొని మన ప్రాంతంలో ఏదో చేయాలని తపనతో రాజకీయాల్లోకి రావడం మాధవి చెప్పారు. తనది అవినీతి సొమ్ము కాదని కష్టపడి తన కష్టార్జితంతో సంపాదించిన ధనం అని, ఎంతోమందికి విద్య ఉద్యోగ అవకాశాలు ఈ 30 ఏళ్లలో కల్పించానని తెలియచేశారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం భావజాలం నచ్చే రాజకీయాల్లోకివచ్చి జనసేన పార్టీలో చేరినట్టు తెలిపారు. వైసిపి పార్టీని గత ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించారని, సంక్షేమం సంక్షేమం తప్పించి అభివృద్ధిని కుంటున పడేశారని మాధవి తెలిపారు. ఆ సంక్షేమం కూడా ఉన్న వారికే ఇస్తున్నారని పేదవాడి చేతికి అందట్లేదని ప్రజలకు తెలిపారు. జగనన్న కాలనీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని, వారు ఇచ్చే ఇంటి బిల్లుకు కూడా ఎన్నో ఆంక్షలు పెడుతున్నారని మాధవి మండిపడ్డారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ జనసేన పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరారు.