బాల రాముడి విగ్రహ ప్రతిష్టను తిలకించండి

మదనపల్లి: భారతదేశంలోని హిందువులకే కాకుండా భారతీయులందరికి కుల మతాలకు అతీతంగా సోమవారం శుభప్రదమైన రోజు అని ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కల లక్షల భారతీయుల బలిదానం వలన ఏర్పడిన అయోధ్య రామ మందిరానికి ప్రారంభం జరుగుచున్న శుభసాందర్భంగా రామ మందిర ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ఒక భారతీయుడిగా కృతజ్ఞతలు తెలియచేసిన జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు. రామ మందిరం నిర్మాణానికి ట్రస్ట్ వారు ప్రభుత్వం నుండి కాకుండా ప్రజల నుండి విరాళాలు సేకరించాలని పిలుపునిస్తే ప్రజల నుండి దాదాపు 3500 కోట్లు విరాళాలు భారత ప్రజలు స్వచ్ఛందంగా ట్రస్ట్ కి అందించడం జరిగిందన్నారు. చాలా సంవత్సరాల పోరాటం తరువాత వాదనలు తరువాత ఐకమత్యంగా కోట్ల రూపాయలు విరాళాలు ఏ కాకుండా హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా పాదయాత్రలు చేసి రామ మందిరం నిర్మాణం పనులు పూర్తి చేసుకొని బాల రాముడి విగ్రహ ప్రతిష్ట జగబోతుందన్నారు. కావున భారతీయులందరు కులాలకు మతాలకు అతీతంగా భక్తి శ్రద్దలతో సోమవారం జరగబోయే బాల రాముడి విగ్రహ ప్రతిష్టను తిలకించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీలు సనా ఉల్లా, గజ్జల రెడ్డెప్ప, రామసముద్రం మండలం అధ్యక్షులు చంద్రశేఖర్, రూరల్ ఉపాధ్యక్షులు పురం నగేష్, ఐటీ విభాగ నాయకులు కల్లూరు లక్ష్మి నారాయణ, రూరల్ మండలం ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, రాజారెడ్డి, గిరి, రూరల్ ప్రధాన కార్యదర్శి జనార్దన్, జంగాల గౌతమ్, ఆదినారాయణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.