కార్తీక శోభను సంతరించుకున్న శైవక్షేత్రాలు

ఈరోజు నుంచి కార్తీకమాసం ప్రారంభం అయ్యింది. నేడు తొలి కార్తీక సోమవారం కావడంతో శైవక్షేత్రాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. ఉదయం 5 గంటల నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారి దర్శనం సమయంలో మార్పులు చేశారు. ఉదయం 5:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరిగి సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతులు ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది.