లేట్ అయినా థియేటర్ లోనే ‘లవ్ స్టోరీ’

కరోనా కారణంగా సినిమా దియేటర్స్ మూతపడడంతో సినిమాలన్ని ఓటిటి బాట పడుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కినేని నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరక్షన్ లో నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు  త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తుంది. కాగా లవ్ స్టోరీ కూడా ఓటిటిలో వస్తుందని అంటున్నారు. సినిమా అవుట్ పుట్ బాగా వస్తుందని.. థియేటర్ లో రిలీజ్ చేస్తేనే బెటర్ అని అంటున్నారు. అయితే థియేటర్లు ఓపెన్ అవడం లేట్ అయితే మాత్రం లవ్ స్టోరీ కూడా ఓటిటిలో రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది. అయితే దర్శక నిర్మాతలు దీనికి ఓకే చెప్పినా కానీ నాగ చైతన్య మాత్రం అందుకు ఒప్పుకోవడంలేదని తెలుస్తుంది. కొద్దిగా లేట్ అయినా థియేటర్ లో సినిమా రిలీజ్ చేస్తే  ఆ లెక్క వేరేలా ఉంటుంది. సినిమా పూర్తయ్యే వరకు వెయిట్ చేద్దాం ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం అన్నాడట చైతూ.