ల‌వ్ స్టోరీ ట్రైల‌ర్.. ప్రేమిస్తే చంపేస్తారా..!

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన సినిమా ల‌వ్ స్టోరీ. విడుద‌ల‌కు ముస్తాబ‌వుతున్న ఈ సినిమా ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ లోనే సినిమా ఎలా ఉండ‌బోతుందో స్ప‌ష్టంగా చూపించారు. చాలా రోజుల త‌ర్వాత ఈ సినిమాలో ఉత్తేజ్ క‌న‌ప‌డ‌గా, నాగ చైత‌న్య‌-సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య జ‌రిగే ల‌వ్ సీన్స్ తో పాటు ఇంట్లో పెద్ద‌ల‌ను ఒప్పించే సీన్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోబోతున్నాయి. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.