క్రాక్ నుంచి బలేగా దొరికావే పాట లిరికల్ వీడియో

మాస్ మహరాజ్ రవితేజా, శ్రుతి హాసన్ జంటగా చేస్తున్న సినిమా క్రాక్. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ వాస్తవ సంఘటల ఆధారంగా తెరకెక్కుతుంది. ఇందులో రవితేజ  పవెర్ ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి బలే తగిలావే బంగారం పాట టీజర్‌ను విడుదల చేశారు. అయితే నేడు ఈ పాటకు సంబంధించి  లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ రలీజ్ చేశారు.

ఈ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ స్వరపరిచిన ఈ పాటను యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ తనదైన శైలిలో ఆలపించారు. ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్న తమన్ యూత్ ని ఆకట్టుకొనే సాంగ్ ని అందించారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. ఈ పాట యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై ఆ అంచనాలను రెట్టింపు చేశాయి.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.