150 బస్సులు, 200 కార్లతో భారీ ర్యాలీగా మచిలీపట్నం

  • ఛలో మచిలీపట్నం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సన్నద్ధంకండి.
  • సభను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించి రాజానగరం నియోజకవర్గ జనసేన సత్తా మరొకసారి చాటుదాం.
  • అరాచక ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ కి అండగా ఉందాం.
  • ఛలో మచిలీపట్నం పోస్టర్ విడుదల చేసిన నాయకులు, జనసైనికులు.
  • 150 బస్సులు, 200 కార్లతో భారీ ర్యాలీగా వెళ్లడానికి ముమ్మర ఏర్పాట్లు.

రాజానగరం, ఈనెల 14న మచిలీపట్నం వేదికగా జరగనున్న జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించి. రాజానగరం నియోజకవర్గ జనసేన సత్తా రాష్ట్రానికి తెలియపరిచి, మార్పు కోరుకుంటున్న రాష్ట్ర ప్రజలకు మంచి సంకేతాన్ని ఇద్దామని మండల కేంద్రమైన కోరుకొండ గ్రామంలో జరిగిన “ఛలో మచిలీపట్నం” కార్యక్రమానికి సంబంధించి రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించి 150 బస్సులు, 200 కార్లతో భారీ ర్యాలీగా మచిలీపట్నం చేరుకుని సభ విజయవంతం చేయడంలో రాజానగరం నియోజకవర్గం కీలకపాత్ర పోషించాలని బత్తల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. మచిలీపట్నం వెళ్లే జనసేన శ్రేణులకు ఉదయం, మధ్యాహ్నం తిరిగి రాత్రి సమయంలో ఆహార ఏర్పాట్లు త్రాగునీరు అందే విధంగా చక్కటి ఏర్పాటు చేయనున్నారు. వీర మహిళల కోసం ప్రత్యేకమైన బస్సులు కేటాయించారు. నియోజకవర్గంలోని సీనియర్ జనసేన నేతలు, జనసైనికులు ఇచ్చిన పలు సూచనలను పరిగణలోకి తీసుకుని క్రియాశీలక సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన మన నియోజకవర్గం, అదే విధంగా ఈ సభ విజయవంతం చేయడం మన రాజానగరం నియోజకవర్గం కీలకపాత్ర పోషించాలని పలువురు సీనియర్ నేతలు సూచించగా వాటికి కావలసిన ఏర్పాట్లను బత్తుల బలరామకృష్ణ వెంటనే ఆమోదించారు. అనంతరం “ఛలో మచిలీపట్నం” పోస్టర్ని నియోజకవర్గంలోని సీనియర్ నేతలు, జనసైనికులు ఆవిష్కరించి కార్యక్రమాన్ని కని, విని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోరుకొండ మండల కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో నియోజవర్గంలోని సీనియర్ జనసేన నేతలు, జనసైనికులు వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.