మడద సత్యవతి కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన పితాని

  • రూపాయలు 10,000/- ఆర్ధికసాయం

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఇటీవల చొల్లంగి పేటలో వర్షాలు కారణంగా విద్యుత్ వైర్ తెగిపోవడం వల్ల తెల్లవారుజామున జీవనోపాధికి వెళుతున్న మత్స్యకార మహిళ మడద సత్యవతి మృతి చెందడం జరిగింది. బుధవారం పెద్దకర్మ సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి జనసేన పార్టీ ఎప్పుడు మీ కుటుంబానికి అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. మడద సత్యవతి కుమార్తెకు ఉద్యోగం ఉద్యోగం విషయంలో సహకరిస్తా అని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఐ పోలవరం మండలం మురముళ్ళ గ్రామానికి చెందిన టీవీ9 విలేఖరి చిలుకూరి శ్రీనివాసరాజు తండ్రి చిలుకూరి సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందినారు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తాళ్ళరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు ముమ్మిడివరం పట్టణ అధ్యక్షులు కడలి వెంకటేశ్వర రావు, గంజా యేసు, సలాది రాజా, జి వేమవరం సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు, చల్లంగి పేట గ్రామ కన్వీనర్ రేలంగి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ గంగబాబు, కుంది దుర్గాప్రసాద్, పాయసం సాయి గండి అనిల్, కొమ్మోజు సుబ్రహ్మణ్యం, గుత్తాల అన్నవరం తదితరులు పాల్గొన్నారు.