గిరిజనులకు అండగా అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు

అనంతగిరి మండల పరిధి లోని దాసరితోట గ్రామంలో జనసేనపార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు చిట్టం మురళి వీరమహిళ రత్నప్రియ అరుణ చలం అద్వర్యంలో మంగళవారం జనసేనపార్టీ నాయకులు పర్యటించడం జరిగింది. దాసరి తోట గ్రామస్తులు చంపి రాముడు S/౦ బోడేస్ చంపి ఎరుకులు S/౦ బోడేస్ అను రైతుల భూములు 8.22 ఎకరాలు భూకబ్జాకు గురైందని వారు తెలిపారు. సర్వే no 61 పట్టా లో బోడెస్ పేరున ఉంది కొంత మంది అనామకులు గిరిజనుల పేరుమీద ఉన్న రెవెన్యూ సిబ్బందితో కలిసి గిరిజనులకు బెదిరిస్తున్నారు. మీ భూములు మేము కొన్నాం మీరు భూములు జోలికి రావద్దు అని గిరిజనులను బెదిరిస్తున్నారు. గిరిజనులు ఏమి చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు ఏదైతే గిరిజనుల భూములు కబ్జాచేయడానికి చూస్తున్నారో వారిపై తక్షణమే LTR కేసు నమోదు చేసి వారిని వెంట అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని జనసేనపార్టీ నాయకులు మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది వెంటనే స్పందించి సాగు చేస్తున్న రైతులకు న్యాయం చేయాలి బెదిరుస్తున్న కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో చేతులు కలిపి రైతులకు ఇబ్బందికి గురిచేస్తున్నారు. వారి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి లేని పక్షన రైతుల తరపున పోరాటం ఉదృతం చేస్తామని తెలిపారు రైతులకు న్యాయం జరిగే వరకు రైతులకు అండగా ఉంటామని తెలిపారు. కాదు లేదు అని రైతుల భూముల జోలికి వస్తే కబడ్ధార్ రైతులకు అధికారులు బెదిరిస్తే జనసేనపార్టీ అండగా ఉంటుందని గ్రామస్తులతో సమావేశమై కబ్జాకు గురైన ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు గ్రామస్తులతో మాట్లాడుతూ మీకు న్యాయం జరిగే వరకు జనసేనపార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొనెడి లక్ష్మణ్ రావు అనంతగిరి మండలం CPM ZPTC దూసరి గంగరాజు కిల్లో మొస్య టోకురు పంచాయతి సర్పంచ్ జనసేనపార్టీ నియోజవర్గం నాయకులు బంగురు రామదాసు, అరకువెలి మండల అధ్యక్షుడు అల్లంగి రామకృష్ణ, వీరమహిళ రత్న ప్రియ, మండల నాయకులు అరుణచలం, గ్రామస్తులు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.