అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన మదనపల్లె జనసేన

మదనపల్లె, గురువారం డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా.. బెంగళూరు రోడ్డు కాలనీ గేట్ లో ఉన్న డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో.. జనసేన రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి, చిత్తూర్ జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, మదనపల్లె టౌన్ అధ్యక్షుడు శక్తి ప్రధాన కార్యదర్శి రెడ్డమ్మ, గండికోట లోకేష్, టౌన్ కార్యదర్శి పద్మావతి టైగర్ పద్దు, మదనపల్లె రామచరణ్ టౌన్ ప్రెసిడెంట్ నవీన్, జనసేన సీనియర్ నాయకులు ఫాజీల్, మండల కార్యదర్శి కుమార్, బార్లపల్లె సురేష్, కిరణ్, మండలం కార్యదర్శి వేణు నాయక్, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు.