శివాజీ గెటప్‌లో మాధవన్

తమిళ హీరో మాధవన్‌.. ఇటు తెలుగు ప్రేక్షకులకే కాదు. బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటుడు. డిఫరెంట్‌ పాత్రలను చేయడానికి ఆసక్తి చూపించే మాధవన్‌ రొటీన్ కు భిన్నంగా కనిపించిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. వీటిలో ఛత్రపతి శివాజీ గెటప్, మహారాజా గెటప్ తో మాధవన్ ఆకట్టుకుంటున్నాడు. ఈ గెటప్స్ అన్ని సినిమాల కోసం ట్రై చేసినవి కానీ ఆసినిమాలేవీ పట్టాలెక్కలేదని పేర్కొన్నాడు. మొత్తానికి ఛత్రపతి శివాజీ గెటప్‌లో మాధవన్ అదరగొట్టాడనే చెప్పాలి. ఈ ఏడాది అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించాడు మాధవన్. ప్రస్తుతం ‘మారా’ అనే తమిళ చిత్రంతో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.