నెల్లిమర్లలో దూసుకుపోతున్న లోకం మాధవి

  • నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు

నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం మండలంలోని అప్పన్నపేట గ్రామంలో ఆదివారం ఉదయం వైసిపి మరియు టిడిపి పార్టీలకు చెందిన పలువురు నాయకులు మరియు కార్యకర్తలు జనసేన నాయకురాలు అయిన శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పన్నపేట గ్రామానికి చెందిన సుమారు 200 మంది గ్రామ ప్రజలకు లోకం మాధవి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అప్పన్నపేట గ్రామానికి చెందిన ప్రజలు మాట్లాడుతూ గత 25 ఏళ్ల నుండి ఆ రెండు పార్టీలకు కొమ్ముకాస్తున్న తమని కేవలం వారి స్వార్ధ ప్రయోజనాలకే వాడుకొని గాలికి వదిలేశారని, ఎన్నికల సమయంలో గ్రామాన్ని అభివృద్ధి బాటలో పెడతారన్న నాయకుల మాటలు నమ్మి వారికి అండగా నిలబడితే ఎన్నికల తర్వాత అదే నాయకులు వారికి మొండి చేయి చూపించారని అప్పన పేట ప్రజలు వాపోయారు. జనసేనపార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం, తమ పిల్లలకి 25 ఏళ్ల బంగారు భవిష్యత్తు కల్పిస్తారు అన్న నమ్మకం అలాగే స్థానికంగా ఉన్నటువంటి శ్రీమతి లోకం మాధవి నాయకత్వం, ఆవిడ నియోజకవర్గంలో పేద ప్రజలకి చేసే సేవా కార్యక్రమాలు, ఆపదలో ఉన్న సామాన్యుడికి ఆవిడ చూపించేటటువంటి చొరవ, చదువుకున్న మహిళగా ఒక విద్యావేత్తగా సామాన్యుడి బాధలు అర్థం చేసుకునే ఒక సాటి మహిళా గుణం చూసి ఎంతో ఆకర్షితులై జనసేన పార్టీలోకి చేరడం జరిగిందని, గ్రామ ప్రజలు తెలిపారు. అప్పన్నపేట గ్రామంలో గత 25 ఏళ్లగా సరైనటువంటి పారిశుధ్యం లేదని అలాగే తాగునీటి సమస్య తమని ఎంతో వేధిస్తుందని. ఇటువంటి సమస్యల నుండి గట్టెక్కాలంటే కేవలం జనసేన పార్టీ వల్లనే సాధ్య పడుతుందని, రాష్ట్రంలో చిత్తశుద్ధి కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అని, మరియు ఒక మహిళగా రాజకీయాల్లోకి ముందుకు వచ్చిన శ్రీమతి లోకం మాధవి మాలో ఈ ధైర్యాన్ని నింపినందుకే ఈరోజు జనసేనలో చేరామని భవిష్యత్తులో జనసేన పార్టీ బలోపేతానికి మరియు గెలుపుకు అన్ని విధాల తమ గ్రామ ప్రజలు కృషి చేస్తారని తెలియజేశారు. లోక మాధవి మాట్లాడుతూ ఈరోజు అప్పన్నపేట గ్రామస్తులు జనసేన పార్టీలోకి చేరడం ఎంతో శుభ పరిణామం అని ఇదే గెలుపుకు మొదటి అడుగుగా భావిస్తున్నామని తెలిపారు. ఇకనుండి మీరందరూ జనసేన పార్టీ కుటుంబంలో భాగం అని మాధవి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అయిన యర్ర రాము, వనం అడివులు, వనం అప్పన్న, వనం నారాయణ, వనము నర్సయ్య మరియు భోగాపురం మండల అధ్యక్షులు వందనాల రమణ రమణ భోగాపురం సీనియర్ నాయకులు పల్లా రాంబాబు పల్లంట్ల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డెంకాడ మండలం జొన్నడ గ్రామంలో జనసేన పార్టీ తరఫున నిర్వహించినటువంటి మెగా ఉచిత వైద్యం మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపు సందర్శించి అక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని తదనంతరం ఆ గ్రామంలో నాయకులు అయిన సారిక అప్పారావు మరియు రాధాలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.