మాడుగుల నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయసమ్మేళనం

*అవినీతి రహిత పరిపాలన అందించడమే జనసేన లక్ష్యం: వంపూరి గంగులయ్య
*మాడుగుల మండల జనసైనికుల కోసం త్వరలో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తాం: వీరా సురేఖ

విశాఖ జిల్లా, మాడుగుల నియోజకవర్గం, గ్రామ స్థాయి నుండి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అరకు పార్లమెంట్ ఇంచార్జి వంపూరి గంగులయ్య పిలుపు నిచ్చారు ఆదివారం స్థానిక తులసి కళ్యాణ మండపంలో జనసేన పార్టీ మండల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షకు మద్దతు పలుకుతూ ప్రారంభమైంది.జన సైనికుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అరుకు పార్లమెంట్ ఇంచార్జి డాక్టర్ వంపూరి గంగులయ్య, నియోజకవర్గ నాయకులు గుమ్మడి శ్రీరామ్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇటీవల తమిళనాడులో చోటు చేసుకున్న ఆర్మీ హెలీకాప్టర్ దుర్ఘటనలో అమరులైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, మరో 12 మందికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా వంపూరి గంగులయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో అవినీతి రహిత పరిపాలన అందించాలన్న లక్ష్యంతో కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పరిపాలన చూసి ప్రజలు విసుగు చెందారని తెలిపారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్టాలకు తరలి పోతున్నాయని వాపోయారు. భవిష్యత్ తరాలు వారు జగన్ను క్షమించరని వాపోయారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. యన్నంశెట్టి సీతారాం మాట్లాడుతూ అధికార పార్టీని కాదని అన్ని వదులుకొని జనసేన పార్టీలో చేరడం అభినందనీయమని కొనియాడారు. మాడుగుల జనసేన పార్టీ వీరమహిళా అధ్యక్షురాలు, వీరమహిళ వీరా సురేఖ మాట్లాడుతూ మాడుగుల మండల జనసైనికుల కోసం త్వరలో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షుడుగా పట్టణ అధ్యక్షులుగా రొబ్బా మహేష్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో జీవి మూర్తి, పిల్ల వీర వెంకట అప్పల సత్యనారాయణ, గండెం రాంబాబు, వీరా సురేఖ, ఎస్.నూకరాజు, గట్టా రామారావు, కోన దుర్గా శ్రీనివాస్, సి.హెచ్ మధు, ఎం దయ, దాసరి అచ్యుత రావు, సిరిగిరిశెట్టి వెంకటరమణ, వి సతీష్, ధర్మిశెట్టి అప్పు, నడిపూరి రాము కోళ్ళ చిన్న, జి శివాజీ, గుమ్మల నానాజీ, చాణక్య, ఉదయ్, రౌతు ప్రసాద్, వెంకటేష్, మంచాల శివ జనసేన వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.