ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కుటుంబానికి భరోసానిచ్చిన మాడుగుల జనసేన

చీడికాడ మండలం LB పట్నం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన తీటి వెంకట రమణకి వైద్య ఖర్చులు నిమిత్తం మాడుగుల నియోజకవర్గం జనసేన వారియర్స్ ఆధ్వర్యంలో 10000రూపాయల నగదును ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ 4 మండలాల జనసైనికులు పాల్గొని బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు.