‘మహా ప్రస్థానం’ టీజర్

తనీష్‌ హీరోగా తెరకెక్కిన మహాప్రస్థానం మూవీ టీజర్  తనీష్‌కి బర్త్ డే కానుకగా తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది. ఓంకారేశ్వర క్రియేషన్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించాడు. తనీష్ సరసన ముస్కాన్‌ సేథీ జంటగా నటించింది. వరుడు మూవీ ఫేమ్ భాను శ్రీ మెహ్రా మరో కీలక పాత్రలో నటించింది. రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సింగిల్‌షాట్‌ విధానంతో తెరకెక్కించిన చిత్రంగా ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారని ఈ టీజ‌ర్ చూస్తే అర్థమవుతుంది.

సమాజంలో జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్‌ ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతున్నట్టు తనీష్ తెలిపాడు. సినిమా టీజర్ సైతం తనీష్ కెరీర్‌లో ఒక భిన్నమైన చిత్రంగా, అతడిని మాస్ హీరోగా చూపించేలా ఉంటుందనేలా టీజర్‌ని డిజైన్ చేశారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నాడు.