మహగం వీ.డి.సినీ రద్దు చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి

  • సీపీఎం, జనసేన పార్టీల డిమాండ్

భైంసా: మహగం గ్రామ వీ.డి.సి నీ రద్దు చేసి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు డిమాండ్ చేసారు. ఆదివారం మహేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ భైంసా మండల పరిధిలోని మహగం గ్రామ వీ.డి.సి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ రోజు అదే గ్రామానికి చెందిన ఆటోలను నడపకుడదని వాళ్ళను భహిష్కరించడం జరిగింది. దీన్ని సీపీఎం, మరియు జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
గతంలో వీ.డి.సి వాళ్ళు 50000 వేలు తీసుకొని ఆటో చార్జీల పెంపు విషయంలో మాట్లాడుకోవడం జరిగింది. కాని మళ్ళీ ఇప్పుడు దుర్మార్గంగా కక్ష్య కట్టి పేద దళిత వర్గానికి చెందిన ఆటో డ్రైవర్లను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారు. ఈ విషయంపై వీ.డి.సి నీ సంప్రదించడానికి వెళ్తే మీతో మాట్లాడేది ఏమి లేదు ఇక్కడి నుండి వెళ్ళిపొండి అని బెదిరించడంతో చేసేదేమీ లేక చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి వీ.డి.సి అరాచకాలకు అడ్డు కట్ట వేసి పోలీసులు చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. లేని యెడల బాధితులకు మద్దతుగా నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని మహేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం భైంసా ఏరియా కమిటీ కన్వీనర్ గైని మురళి మోహన్, జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు
ఆటో యూనియన్ అధ్యక్షులు సిరాజ్, డ్రైవర్లు మజర్, సాయినాథ్, శంకర్, భీమ్ రావ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.