మహాజ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్

పలమనేరు, ‘నేను, నా దేశం ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యమైనది’ ఎంత గొప్ప మాటలు. ఇంత మంచి మాటలు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా గొప్పగా ఎవరు చెప్పగలరు? రాజ్యాంగమనే మహా సూత్రాలను భరత జాతికి అందించి, ఈ దేశం సమైక్యంగా.. సమున్నతంగా.. సమభావంగా.. శక్తివంతంగా.. ముందుకు సాగడానికి పద నిర్దేశం చేసిన దేశ భక్తుడు. అంబేద్కర్ వంటి మహాజ్ఞాని కోటికొక్కరు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నాను. ముఖ్యంగా నాకు అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత. ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. విద్యావేత్తగా, మేధావిగా, న్యాయకోవిదునిగా, పాత్రికేయునిగా, రాజకీయ నాయకునిగా, రాజ్యాంగ నిర్మాణ సారధిగా, న్యాయశాఖామంత్రిగా ఆయన ఈ దేశానికీ చేసిన సేవలు వెలకట్టలేనివి, అంటరానితం నిర్మూలనకు తన జీవిత చరమాంకం వరకు అవిరళ కృషి చేసి అసామాన్యునిగా నిలిచారు.ఆయన బోధించిన ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. అదే జనంకోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ అనే మాటలను మననం చేసుకుంటూ శాంతిమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.