మహానటి’ కీర్తి సురేష్ బర్త్ డే.. సర్‌ప్రైజింగ్ పోస్టర్స్

దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్. మహానటిగా హోమ్లీ లుక్స్ తో అల్లరించిన కీర్తి.. తెలుగు, తమిళ, మలయాళీ బాషా చిత్రాల్లో నటించి కుర్రళ్ల మనసు దోచింది. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలతో నటిస్తూ దూసుకుపోతోంది. ఆదివారం (అక్టోబర్ 17) కీర్తి పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

కాగా, కీర్తి బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట , భోళా శంకర్ చిత్రాలలో కీర్తి లుక్‌కి సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. ఇవి అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్‌.. చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్న విషయం తెలిసిందే.

Image