శ్రీ సిద్ధభైరవేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు

గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు మండలం దామెర్ల చెరువు వద్ద వెలసిన శ్రీ సిద్ధభైరవేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా 1/3/2022 రాత్రి జాగారం భక్తి గీతాల కచేరి స్వామివారికి అర్చన అభిషేకాలు లింగోద్భవ కాలంలో జరుగును. ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని అన్నదానానికి గిద్దలూరు నియోజకవర్గం జనసేన నాయకులు చిన్న కంభం గ్రామ వాస్తవ్యులు కొమరోలు మండలంలోని దామెర్ల చెరువు వద్ద వెలసిన శ్రీ సిద్ధ భైరవేశ్వర ఆలయంలో అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ, కొమరోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు సారె ఓబులేసు నాయుడు, ఆలయ అభివృద్ధి కమిటీ తరఫునుంచి అభినందనలు తెలిపారు, ప్రజా నాయకుడు కులాల ప్రస్తావన లేని నాయకుడు మతాలను కలుపుకొని పోయే నాయకుడు అన్నదాత అయినటువంటి తోట సుబ్బారావు కి సిద్ధ భైరవేశ్వరుని కృపాకటాక్షాలు కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆలయ అభివృద్ధి కమిటీ వారు పాల్గొన్నారు.