- ఆధ్యాత్మిక భావనతో పులకించిన భక్తజనం
ప్రతి సంవత్సరం కొత్తకోట గ్రామంలో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలు ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సంవత్సరం మట్టితో తయారుచేసిన ఆదియోగి విగ్రహంతో పాటు ఐసు బ్లాక్స్ తో ప్రత్యేకంగా తయారుచేసిన శివలింగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది దంపతులు ఏకవార మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. అలాగే పలు సాంస్కృతి కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. భక్తులు ఈ కార్యక్రమం నిర్వహన పట్ల మహాశివరాత్రిఏర్పాట్లు పట్ల వారి సంతోషాన్ని వ్యక్తపరచారు. భవిష్యత్తులో కూడా ఆ పరమశివుని అనుగ్రహంతో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేపడతావని రాజన్న ఫౌండేషన్ చైర్మన్ పివిఎస్ఎన్ రాజు అన్నారు.
Share this content:
Post Comment