ఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి

కూకట్ పల్లి: మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతి కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ.. భారతీయ సామాజిక వ్యవస్థ, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, విద్య తదితర అంశాలలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, పసుపులేటి ప్రసాద్, కలిగినీడి ప్రసాద్, హరీష్ శిరిగినీడి, షణ్ముఖ, మండలి అనిల్, పులగం సుబ్బు, కావలి వెంకటేష్,వాయు కుమార్ అడబాల,మణికంఠ గన్న భక్తుల, సాయి ప్రసాద్ (బి జె వై ఎం కూకట్పల్లి అసెంబ్లీ కన్వీనర్), సాయి మూసాపేట్ డివిజన్ బిజెపి జనరల్ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.