జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

విజయనగరం, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కలెక్టరేట్ కూడలిలో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహనరావు మీడియాతో మాట్లాడుతూ… సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని, అక్షరం ద్వారానే అణగారిన వర్గాలు అభివృద్ధి చెందుతాయని నమ్మి, వారి అభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని, ఇటువంటి మహనీయున్ని అన్ని తరాలవారు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), వంక నరసింగరావు, దంతులూరి రామచంద్ర రాజు(రమేష్ రాజు) డోల రాజేంద్ర ప్రసాద్, జోయ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.