మేడే వేడుకల్లో సుంకెట మహేష్ బాబు

*జనసేన నేత సుంకెట మహేష్ బాబు ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల పరిరక్షణకు డిమాండ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మేడే సందర్భంగా భైంసా ఎం.ఆర్.ఓ కార్యాలయం ఎదుట ఐలమ్మ గద్దె వద్ద ఎర్ర జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్మికులు రోజుకు 8 గంటల పని చేయాల్సిందేనని, కానీ యాజమాన్యాలు చట్టాలను ఉల్లంఘిస్తూ ఎక్కువ గంటలు పని చేయిస్తున్నారని విమర్శించారు. కార్మికులైన మహిళలకు తగిన భద్రత, సౌకర్యాలు లేవని, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పనికి తగిన ప్రతిఫలం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికులకు రక్షణ, పేద–మధ్య తరగతి ప్రజలకు ఉపాధి కల్పన, ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని ప్రభుత్వాలను కోరుతూ, కార్మికుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, నవీన్, ముఖేష్, మహమ్మద్ రఫీ, వినోద్, లక్ష్మణ్, ముత్యం సహా పలువురు జన సైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment