వచ్చే సంక్రాంతి బరిలో మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’

కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో నిస్తేజంగా మారి, ఓటీటీ వేదికలపై ఆధారపడిన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మళ్లీ ఊపు పెరిగింది. భారీ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించడమే కాదు, అనేక పెద్ద సినిమాలు షూటింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ ఎప్పుడు రిలీజ్ అయ్యేది చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మహేశ్ బాబు తాళాలగుత్తి పట్టుకుని ఉన్న స్టిల్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది.

పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.