రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ దళిత నాయకుడు మహేష్ నగిరిపాటి, వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక దీక్ష ప్రారంభించారు. తెలంగాణలోని అంభత్రేయ శక్తి పీఠంలో ఆధ్యాత్మిక గురువులు ఆదిత్యపరాశ్రీ స్వాముల పర్యవేక్షణలో ఈ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ తరువాత దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదగాలని, ఆయనే భవిష్యత్ భారత రథసారథిగా వెలుగొందాలని ఆకాంక్షించారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో సత్సామాజిక మార్పులకు బాటలు వేసే ప్రయత్నాల్లో, తన ఆయుష్షు, ఆరోగ్యానికి వరాహి అమ్మవారి ఆశీస్సులు కావాలన్నదే తన దీక్ష సంకల్పమన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేపట్టే ప్రతి మంచి కార్యక్రమం విజయం సాధించాలన్న ఉద్దేశంతో ఈ దీక్ష చేస్తున్నానని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో వైసీపీ అరాచకాలను నిలదీస్తూ, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తన పాత్రను గుర్తుచేసిన మహేష్, పవన్ కళ్యాణ్ గారి విజయానికి తాను ప్రతి రీతిగా శక్తినిచ్చేందుకు సిద్ధమని చెప్పారు.
Share this content:
Post Comment