నమ్మక ద్రోహి పోతిన మహేష్

  • గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య
  • గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు

జనసేన పార్టీలో చేరిన నాటి నుండి నిన్నటిదాకా పార్టీలో పోతిన మహేష్ కి జనసేనాని పవన్ కళ్యాణ్ సముచిత స్థానం కల్పించారని నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజులు అన్నారు. బిసి నాయకుడిగా మహేష్ ఎదగాలని పార్టీలో సముచిత స్థానం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. అయితే రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బి.జె.పి.కి ఇవ్వటం వలన పోతినకు సీటు కేటాయించలేకపోయినారని వారు అన్నారు. విజయవాడ పట్టణ అధ్యక్షునిగా తన స్థాయికి తగ్గ గుర్తింపు ఇచ్చినా కాని ఈరోజు జనసేన పార్టీకి నమ్మకద్రోహం చేయటం హేయమైన చర్యగా వారు అభివర్ణించారు. 2019లో కమ్యునిస్టు పార్టీలు మంగళగిరి, పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం పట్టుబట్టారు కానీ పోతిన కోసం పట్టుబట్టి జనసేన పార్టీ తరపున పోటీలో నిలిపారు. నగర అధ్యక్షుడుగా నగరంలో మూడు నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక కార్పోరేషన్ సీటు కూడా గెలిపింలేదు. వైసిపి నేతలతో చీకటి రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గ్రహించి దూరం పెట్టి ఉంటారు అని అన్నారు. నేను జనసేన పార్టి నుండి బయటకు వెళ్ళిపోతే నాచేతిని కత్తితోటి నరకడమే అని ఆరోజు ప్రగల్భాలు పలికిన ఈ నయవంచకుడు నేడు తన దౌర్భాగ్యపు బుద్దిని ప్రజలకు తెలియజేసారు అని వెంకటరత్తయ్య, చింతా రేణుకా రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.