ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయండి: దుగ్గిశెట్టి

*జనసేన ఆవిర్భావ పోస్టర్ ను ఆవిష్కరించిన జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి

నెల్లూరు: మార్చ్ 14న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు కోరారు. సోమవారం నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లో ఉన్న జనసేన నెల్లూరు నగర కార్యాలయంలో జనసేన ఆవిర్భావ దినోత్సవంకి సంబంధించి వాల్ పోస్టర్ లను సుజయ్ బాబు, జనసైనికులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ జిల్లా పర్యవేక్షకులు, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సారధ్యంలో జనసైనికులు అందరూ ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని, అది కూడా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరగటం సంతోషంగా ఉందన్నారు. నగరంలోని 54 డివిజన్ ల నుంచి జనసైనికులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.

Share this content:

Post Comment