*జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సంయుక్త కార్యదర్శి పొగిరి సురేష్ బాబు
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సంయుక్త కార్యదర్శి పొగిరి సురేష్ బాబు పిలుపునిచ్చారు. మార్చి 14న పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేసేందుకు జనసైనికులంతా భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, టౌన్ జనసేన నాయకులకు ఐదువేల గోడపత్రికలను అందజేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు జనసైనికుల కోసం పెద్ద పండుగవంటివని, ప్రతి జనసైనికుడు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఎప్పటికీ ప్రజా సంక్షేమం కోసం పోరాడుతుందనీ, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన పార్టీ జనసేననేనని సురేష్ బాబు గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టారని, జనసేన పార్టీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. పిఠాపురం ఆవిర్భావ వేడుకలకు హాజరయ్యే ప్రతి జనసైనికుడు సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకోవాలని సూచించారు.
Share this content:
Post Comment