జనసేన ఆవిర్భావ సభను జయప్రదం చేయండి: రాటాల రామయ్య

సిద్దవటం: జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈనెల 14న పిఠాపురంలో నిర్వహించనున్న జనసేన 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పిలుపునిచ్చారు.
సోమవారం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర హీనుడు. తన స్థాయిని మరిచి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడం, జనసైనికుల ఆగ్రహానికి కారణమవుతుంది,” అని అన్నారు. మొదటిసారిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోడీ గమనిస్తున్నారని, అటువంటి వ్యక్తిపై జగన్ విమర్శలు చేయడం అనుచితమన్నారు.”పిచ్చి పట్టినట్లు పోసాని వలే, జగన్‌కు కూడా పిచ్చి పట్టింది,” అంటూ ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ అభివృద్ధి, సంక్షేమం కోసమే పనిచేస్తారని, అందుకే రాష్ట్ర ప్రజలు ఆయనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని అన్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఆవిర్భావ సభకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, జనసేన కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని రాటాల రామయ్య కోరారు.

Share this content:

Post Comment