జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి: జనసేన కార్పొరేటర్లు పిలుపు

ఈ నెల 14న జరగబోయే జనసేన ఆవిర్బావ సభను విజయవంతం చేయాలని ఆపార్టీ కార్పొరేటర్లు, నాయకులు, పార్టీ వీర మహిళలు ఒంగోలులో పిలుపునిచ్చారు. శుక్రవారం ఒంగోలు లోని మాజీ మంత్రి జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాలినేని కార్యాలయంలో పార్టీ ప్లీనరి పోస్టర్ ను ఆవిష్కరించారు. శుక్రవారం సందర్భంగా వారు మాట్లాడుతూ తొలుత అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. గత పుష్కర కాలం నుంచి జనసేన పార్టీ ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నేడు విజయతీరాలకు చేరిందని, ఆనందం వ్యక్తం చేశారు. మా ఆదినాయకులు పవన్ కళ్యాణ్ తో ఎంతో మంది కలసి ప్రయాణం చేశారని, అయితే కొందరు మధ్యలో ఆగిపోయారని, కొందరు వచ్చారని పేర్కొన్నారు. ఈరోజు నెల 14 వ తేది పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుందని తెలిపారు. జిల్లా నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తరలిరావాలని పిలుపు నిచ్చారు.పార్టీ నాయకులు బాలినేని సారధ్యంలో జిల్లా నలుమూలల నుంచి భారీగా ప్లీనరీకి రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వెలనాటి మాదవరావు, కార్పొరేటర్లు మలగా రమేష్, ఈదర వెంకట సురేష్ బాబు, యనమదల నాగరాజు, నీలంరాజు సరోజ, తాడి కృష్ణలత, గోపాలరెడ్డి, గోలి లక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, నరహరి సాంబయ్య, పోకల నరేంద్ర, గంధం నరేష్, భూపతి రమేష్, పోకల వేణు, శేషగిరి, పోకల హనుమంతరావు, గోలి తిరుపతిరావు, నాగేశ్వరరావు, రాఘవ, అజిజ్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment