అమలాపురం రూరల్ మండలం, నల్లమిల్లి గ్రామంలో జరిగిన మండల స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆవిర్భావ దినోత్సవ అమలాపురం నియోజకవర్గ సమన్వయకర్తలు, ఏపీ.ఎం.ఎస్.ఎం.ఈ.డి.సి చైర్మన్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన తమ్మిరెడ్డి శివ శంకర్, నెల్లూరు సిటీ అధ్యక్షులు దుగ్గిశెట్టి విజయ్ బాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆవిర్భావ దినోత్సవ సమాయత్తం గురించి అమలాపురం రూరల్ మండలంలోని 22 గ్రామాల నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు. రూరల్ మండలం నుంచి ఈ నెల 14న జరగబోయే ఆవిర్భావ దినోత్సవ సభను భారీగా విజయవంతం చేసేందుకు పెద్దఎత్తున తరలి వెళ్తామని లింగోలు పండు గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవిర్భావ దినోత్సవ క్రౌడ్ మేనేజ్మెంట్ సభ్యులు నల్లా శ్రీధర్, కల్వకొలను తాతాజీ, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, మున్సిపల్ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, మాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంచిపళ్లి అబ్బులు, ఆవిర్భావ దినోత్సవ జిల్లా కమిటీ సభ్యులు లింగోలు పండు, ఆకులు బుజ్జి, మెడికల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు నాగ మానస, జనసేన నాయకులు ఇసుకబట్ల రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం రూరల్ మండల నాయకుల్లో పరమట చిట్టిబాబు, నల్లా వెంకటేశ్వరరావు, సత్తి శ్రీనివాస్, పాలూరి నారాయణ స్వామి, నందుల సత్తిబాబు, గంధం శ్రీనివాస్, ఎంపీటీసీలు పోలిశెట్టి చిన్ని, మోటూరి వెంకటేశ్వరరావు, సత్తి ఆదిలక్ష్మి, కోరుమిల్లి రాంబాబు, సర్పంచ్ రావూరి భాస్కర్ రావు, ఉప సర్పంచ్ వాకపల్లి వెంకటేశ్వరరావు, ఉర్రింకి బుజ్జి, వీర మహిళ కర్రి లక్ష్మీ దుర్గ, మండలంలోని వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, జనసైనికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకారం అందించిన నల్లమిల్లి గ్రామ జనసేన నాయకులు బద్రి సాయిబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు నల్లా మూర్తి, గ్రామ యువనేత గోకరకొండ కుమార్ లకు జనసేన పార్టీ అమలాపురం రూరల్ మండలం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Share this content:
Post Comment