కైకలూరు, పిఠాపురం జిల్లా చిత్రాడ గ్రామంలో ఈనెల 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని కైకలూరు నియోజకవర్గంలోని సీతారామ ఫంక్షన్ హాల్‌లో శనివారం రాత్రి జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి) ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చన్నమళ్ళ చంద్రశేఖర్ హాజరై ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు అన్నారు, ఈ 11 ఏళ్ల జనసేన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి 100% స్ట్రైక్ రేట్ సాధించడంలో పవన్ కళ్యాణ్ గారి సంకల్పం కీలకమైనదని తెలిపారు. జనసేన ఆవిర్భావ సభ ద్వారా పవన్ కళ్యాణ్ గారు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని ఆయన తెలిపారు. కైకలూరు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో జనసైనికులు ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం ఆనందంగా ఉందని, ఆయన పార్టీలో చేరిన కారణాన్ని వ్యక్తం చేశారు. కొల్లి వరప్రసాద్ (బాబి) కైకలూరు నియోజకవర్గం జనసైనికులు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment