*అరకు పార్లమెంట్ నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్ వంపూరు గంగులయ్య
అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం కోసం మే 2వ తేదీ బుధవారం రోజున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి విచ్చేయనున్న సందర్భంగా, వారి సభను జయప్రదం చేయడానికి పాడేరు నియోజకవర్గం నుంచి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లాలని కోరుతున్నామని పాడేరు అసెంబ్లీ, అరకు పార్లమెంట్ నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్ వంపూరు గంగులయ్య మాట్లాడుతూ.. ఈ సభకు హాజరయ్యేలా పాడేరు నియోజకవర్గానికి 12 బస్సులు కేటాయించబడినవి, ప్రతి మండలానికి రెండు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలను తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులకు అప్పగించబడింది. కావున జనసేన పార్టీ మండల అధ్యక్షులు తమ మండలాల్లోని టీడీపీ మండల అధ్యక్షులతో సమన్వయం చేసుకొని, కూటమి నేతలతో కలసి ఈ సభను విజయవంతంగా జరగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నానని గంగులయ్య తెలిపారు.
Share this content:
Post Comment