నాదెండ్ల మనోహర్ సభను విజయవంతం చేయండి: కనపర్తి మనోజ్ కుమార్

కొండెపి: జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సభను విజయవంతం చేయండి అని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉదయం 11గంటలకు ఒంగోలు మౌర్య హోటల్ కు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేరుకుంటారు, మరణించిన కార్యకర్త కుటుంబానికి జనసేనపార్టీ తరఫున చెక్ లు అందజేస్తారు, తదనంతరం మీడియాతో మాట్లాడతారు, కావున పొన్నలూరు మండల నాయకులు, వీరమహిళలు, కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.