ఉపాధ్యాయ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మని గెలిపించండి: గురాన అయ్యలు

విజయనగరం, ఈనెల 27న జరగనున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గెలుపునకు టీడీపీ, జనసేన క్యాడర్‌ కృషిచేయాలని జనసేన నేతలు గురాన అయ్యలు, ఆదాడమోహనరావు, పెంటతిరుపతిరావు పిలుపునిచ్చారు. మంగళవారం గురాన అయ్యలు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా ఉన్నత సేవలు అందించి, ఉత్తరాంధ్ర సమస్యలు మీద పోరాటాలు చేసిన ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి రఘువర్మకు మద్దతు ఇస్తున్నామన్నారు. పాకలపాటి రఘువర్మ ఒక పర్యాయం శాసనమండలి సభ్యునిగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషిచేశారని, మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. రఘువర్మ వంటివారు శాసన మండలిలో ఉంటే విద్యా రంగ సంబంధమైన అంశాలపై మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. రఘువర్మకి తెలుగుదేశం, జనసేన మద్దతు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయ ఓటర్లు రఘువర్మకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పిన్నింటి జయకృష్ణ, దంతులూరి రామచంద్రరాజు, ఆదాడ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment