రా కదలిరా సభను విజయ వంతం చేయండి

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్ ముత్తా శశిధర్ బుధవారం తునిలో జరగబోతున్న తెలుగుదేశం పార్టీ చేపడుతున్న రా కదలిరా సభకు కాకినాడ సిటి నుండీ భారీగా జనసైనికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా పాల్గొనే దిశలో వెళ్ళుతున్నవేళ ప్రజలకు తాము సంఘటితంగా ముందుకు వెళ్ళుతున్నామని తెలియచేసేలా కృషిచేయలన్న తమ అధినేత పవన్ కళ్యాణ్ గారి స్పూర్తిని అనుసరించి రేపు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పరిధిలో జరగబోతున్న రా కదలిరా సభకు కాకినాడ సిటి నుండీ ఈసభను విజయవంతం చేసేందుకు స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తోడుగా పెద్ద ఎత్తున పాల్గొనవలసినదిగా ఒక ప్రకటనలో జనసేన పార్టీ నాయకులను, జనసైనికులను కోరారు.