రా కదలిరా సభను విజయవంతం చేయండి

  • జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్

గురజాల: రా కదలిరా సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దాచేపల్లిలో మార్చి 2 శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలవ్వనున్న మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా.. యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా స్థాయి రా.. కదలిరా..! బారీ బహిరంగ సభకు, జనసేన పార్టీ నాయకులు మరియు టిడిపి నాయకులు అందరూ వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని, నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన అంతమొందించి జనసేన, టిడిపి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. దీనికి సాక్ష్యంగా ఈ సభ నిలవబోతుందని అన్నారు.