2వ దశ వారాహి యాత్రను విజయవంతం చేయండి

తాడేపల్లిగూడెం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర రెండవ దశలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జనసేన పట్టణ కమిటీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జులై 14వ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక అల్లపురం దగ్గర జయ గార్డెన్స్ నుంచి సుమారు 500 కార్లతో మరియు 5000 బైకుల ర్యాలీతో పవన్ కళ్యాణ్ గారికి ఘనస్వాగతం పలికి వారాహి విజయ యాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల నారాయణమూర్తి, మైలవరపు రాజేంద్రప్రసాద్, సజ్జ సుబ్బు, కేశవభట్ల విజయ్, సోమశంకర్ బయనపాలేపు ముఖేష్, వీరమహిళలు కందుల విజయ చాంద్ బేబి, కల్యాణి, చిన్ని, మధు శ్రీ మరియు తదితరులు పాల్గొన్నారు.