జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయండి

  • జనసేన ఆవిర్భావ దినోత్సవ భారీ బహిరంగసభ ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

అమలాపురం: జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలో భారీ బహిరంగసభ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి మార్చి 14 సాయంత్రానికి అమలాపురం నియోజకవర్గం నుండి భారీగా తరలి వెళ్లేలా ప్రణాళిక చేసుకున్నట్టు జనసేన పార్టీ నాయకులు నల్లా శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ భారీ బహిరంగసభకు సంబందించిన ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కంచిపల్లి అబ్బులు, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, లింగొలు పండు, పడాల నానాజీ, ఆర్.డి.యస్.ప్రసాద్, నాగ మానస, బట్టు పండు, పోలిశెట్టి బాబులు, పోలిశెట్టి చిన్ని, కే యస్ యస్ నాయకులు బసవా చినబాబు, తిక్కా శేషు బాబు, పెనుమాల జాన్ బాబు, తిక్కా సరస్వతి, నల్లా వేంకటేశ్వర రావు, అల్లాడ రవి, స్వర్ణ కార జనసేన నాయకులు, కరిముల్లా బాబా మరియు జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.