జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

పొన్నలూరు, జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు.. 12-06-2022 న అనగా ఆదివారం ఉదయం 10 గంటలకు పొన్నలూరు మండలంలో.. లింగోరిగుంట గ్రామంలో.. పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో.. జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మరియు కొండేపి నియోజకవర్గం నాయకులు గౌరవనీయులు మేడా రమేష్ నాయుడు చేతుల మీదగా క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాలు ప్రధానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున పొన్నలూరు మండలంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మరియు క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.