ఎన్.డి.ఏ కూటమిని గెలిపించండి

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బీసీల ఆత్మీయ సమావేశం రామ్ నగర్ యాదవ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి, బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థులైన అంతపురం పార్లమెంటు అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మరియు అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో పాటు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరాం రెడ్డి మాటాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి.. జనసేన – టిడిపి – బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థులుగా, అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీ మరియు అనంతపురం అర్బన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇరువురు “సైకిల్ గుర్తుపై” పోటీ చేయుచున్నారు. మనమందరం కలిసి 13-5-2024 తేదీన మన అమూల్యమైన ఓట్లను “సైకిల్ గుర్తుపై” వేసి, మనకు కావలసిన వారందరితో “సైకిల్ గుర్తుపై” ఓట్లను వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరుపేరునా విజ్ఞప్తి చేసారు.