రాజకీయ విప్లవం వారాహి యాత్రను విజయవంతం చేయండి

వెంకటగిరి నియోజకవర్గం: అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి నుంచి ప్రారంభం అవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ కలువాయి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు పెరంకొండ మనోహర్, జనసైనికులు మరియు జనసేన నాయకులు ఆధ్వర్యంలో గ్రామంలోని పడమట వీధిలో వాల్మీకి రామాలయంలో పూజలు చేసి అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 51 టెంకాయలు కొట్టి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాలని మొక్కలు తీర్చుకున్నారు. అక్కడ నుంచి బైకులతో ర్యాలీ నిర్వహించి గ్రామ దేవత కలువాయమ్మ తల్లిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా గ్రామదేవత కలువాయమ్మ తల్లి చల్లని దీవెనలు ఎల్లవేళలా పవన్ కళ్యాణ్ గారిపై ఉండాలని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సు కోసం పదేళ్లుగా ఆటుపోటులను ఎదుర్కొని నిలబడిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా జనసేన నాయకులు, వీరమహిళలు, జనసేన మద్దతు దారులు, మెగా అభిమానులు తరలిరావాలి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రవళిక, నరేష్, రామకిషోర్, టి. వెంకటేష్, వెంకటపతి, శ్రీరామ మనోహర్, రామకృష్ణ, సుసర్ల శ్రీహరి, పసుపులేటి శ్రీహరి,భువన్, హరి ఏటూరి, గణేష్, బత్తుల సునీల్, పులిబండ వాసు, నవీన్, పెంచలయ్య, నరసింహ ప్రసాద్, అశోక్, మా భాష, నవీన్, మహేంద్ర, దావూద్ భాష తదితరులు పాల్గొన్నారు.