జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆదేశాల మేరకు రైతు దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు గురువారం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పితాని బాలకృష్ణ తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో రైతులతో మమేకమై వ్యవసాయ భూములను సందర్శిస్తామని, రైతులతో చర్చించి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకుంటామని తెలిపారు. 23.12.2022 వ తేది శుక్రవారం ఉదయం 7.00 గంటలకు ఐ పోలవరం మండలం గుత్తినదీవి గ్రామంలో, ఉదయం 9 గంటలకు ముమ్మిడివరం మండలం కర్రి వాని రేవు గ్రామంలో, ఉదయం 10 గంటలకు ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో, 11 గంటలకు కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో, సాయంత్రం 4.00 గంటలకు తాళ్లరేవు మండలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, గుద్దటి జమ్మి, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, గొలకోటి వెంకన్న బాబు, మద్దింశెట్టి పురుషోత్తం, మోకా బాల ప్రసాద్, అత్తిలి బాబురావు, తాళ్లూరి ప్రసాద్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.