వారాహి యాత్రను జయప్రదం చేయండి..

  • జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జనసేన నేతలు బొలిశెట్టి, పితాని

ముమ్మిడివరం: కాట్రేనికోన మండలం, జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం కందికుప్పు గ్రామంలో సీనియర్ నాయకులు నూకల దుర్గ బాబు స్వగృహంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశ్యము జూన్ 14వ తేదీన అన్నవరం నుంచి మొదలయ్యే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించి. అదేవిధంగా జూన్ 20వ తారీఖున ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగే వారాహి యాత్ర భారీ బహిరంగ సభను జయప్రదం చేయుట గురించి చర్చించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు వారాహి యాత్ర సమన్వయ కర్త బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ విచ్చేసి జనసేన నాయకులను, కార్యకర్తలను, జనసైనికులను, వీరమహిళను ఉద్దేశించి 20వ తారీకు జరిగే పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర జయప్రదం చేయాలని అదేవిధంగా అత్యధికంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు, ప్రజలు తరలివచ్చి ఈ వారాహి యాత్రను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వారాహి యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోక బాల ప్రసాద్, ఉపాధ్యక్షులు కాయల బలరాం, సీనియర్ నాయకులు నూకల దుర్గ బాబు, నూకల మూర్తి, రంబాల చౌదరి బాబు, గంగుమల్ల రవి, ఓగూరి భాగ్యశ్రీ, పిల్లి గోపి, పెమ్మాడి శ్రీను, బల్ల కుమార్, మట్టపర్తి శంకరం, గిడ్డి రత్నశ్రీ, ఓగూరి నూతన బాబు, అడపా సాయి, పిల్లి రామలక్ష్మి, ఓలేటి శ్రీను, రాగుర్తి ఏసోబు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు పాల్గొన్నారు.