స్వచ్చంద రక్తదాన శిభిరాన్ని విజయవంతం చేయండి

గుంతకల్లు నియోజాకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో గుంతకల్లు నియోజాకవర్గం జనసేన పార్టి నాయకులు అరికేరి జీవన్ కుమార్ జన్మదినం సందర్బంగా గోపి బ్లడ్ బ్యాంక్ నందు శనివారం “స్వచ్చంద రక్తదాన శిభిరం” గుంతకల్లు పట్టణంలోని గోపి బ్లడ్ బ్యాంక్ నందు రక్తదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ గొప్ప కార్యక్రమానికి జనసేన శ్రేణులు, టీడీపీ శ్రేణులు, మెగా అభిమానులు, వీరమహిళలు, జనసేన – టిడిపి పార్టీ నాయకులు, మద్దతుదారులు, ప్రాణదాతలు ప్రతిఒక్కరూ పాల్గొని “స్వచ్చంద రక్తదాన శిభిరాన్ని” విజయవంతం చెయ్యాలి అని కోరారు.